Lenovo Vibe K5 Note (Grey, 64 GB) (With 4 GB RAM)

Lenovo Vibe K5 Note (Grey, 64 GB)  (With 4 GB RAM)
13499/

Samsung Gelaxy Grand Duos 19082

12 Aug 2015

పెప్సీకి బడా ఫైన్

ఏ దిల్ హై మాంగే మోర్.. అంటూ ప్రాణాలతో చెలగాటమాడిన పెప్సీ, కోలా కంపెనీల నడ్డివిరిగేలా చెన్నై వినియోగదారుల ఫోరం జరిమానా వడ్డించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై లోని పట్టినంబక్కమ్‌కు చెందిన నెహ్రూ అనే వ్యక్తి  ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. తనను కలిసేందుకు వచ్చిన వినోద్ అనే మిత్రుడి కోసం సెయింట్ బీడ్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ క్యాంపస్‌లోని క్యాంటీన్ నుంచి రెండు 200 యం.ఎల్. పెప్సీ డ్రింక్ బాటిళ్లు తెచ్చాడు. ఇద్దరూ  ఆ డ్రింక్ తాగిన తరువాత  ఆఫీసులకు వెళ్లిపోయారు. ఐతే, కాసేపటికే వినోద్‌కు వాంతులు మొదలయ్యాయి. దీంతో  వెంటనే వినోద్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ఆయన తాగిన కోలాను పరిశీలించిన డాక్టర్లు ఆ డ్రింక్‌లో చనిపోయిన పురుగు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఖంగారుపడ్డ నెహ్రూ వెంటనే తాను పెప్సీ కొన్న షాపు ఓనర్ వద్దకు వెళ్లి  ఆ కూల్ డ్రింక్స్‌ని ఎవ్వరికీ అమ్మవద్దనీ, ఇదే విషయాన్ని పెప్సీ కంపెనీకి అఫీషియల్‌గా తెలియజేసినా ఈ విషయాన్ని లైట్‌గా తీసుకోవడంతో నెహ్రూ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. అంతేకాకుండా 15.25 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని పిటిషన్ వేశాడు.
\కేసు హియరింగ్‌కు వచ్చింది. బాటిల్ తమ కంపెనీదే కానీ, దాన్లో ఉన్న డ్రింక్ మాత్రం మాది  కాదని కంపెనీ వాదించింది. ఐతే, పెప్సీ నకిలీది అని చెప్పే రుజువులను కోర్టుకు చూపించలేకపోయింది. కోర్టు ఆ డ్రింక్‌ను ల్యాబ్‌కు పంపింది. అది పురుగో.. చెట్టు బెరడో.. తెలియదుకానీ బాగా కుళ్లిపోయిన అవశేషం డ్రింక్‌లో ఉందని, అది మనుషులు తాగడానికి పనికిరాదనీ ల్యాబ్ తన నివేదికలో పేర్కొంది. దీంతో జిల్లా వినియోగదారుల ఫోరం ప్రజలకు నాణ్యమైన కోలా అందించడంలో నిలువెత్తు నిర్లక్ష్యం వహించారంటూ  క్యాంటిన్ ఓనర్‌కూ, పెప్సీకోలా సంస్థకూ అక్షింతలు వేసింది.  క్లయింట్  నెహ్రూకు నష్టసపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. దీంతో  పెప్సీ సంస్థ కాళ్ళ బేరానికి వచ్చింది. క్లయింట్ డిమాండ్ చేసిన నష్టపరిహారం మొత్తం మరింత ఎక్కువగా ఉందనీ , అంత చెల్లించలేమని ప్రాధేయపడటంతో యాభై వేల రూపాయల జరిమానా, కోర్టు ఖర్చుల కింద మరో ఐదు వేలు చెల్లించాలని ఆదేశించింది.

No comments:

Post a Comment